తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటిలో 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల పదవీ కాలం జూన్ 3న పూర్తి కానుండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16న పూర్తవుతోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ ఖాతాలోని ఈ స్థానాలు తిరిగి ఆ పార్టీకే దక్కనున్నాయి. అయితే, ఆశావహుల సంఖ్య పెరగడంతో సీఎం కేసీఆర్ కు అభ్యర్థుల ఎంపిక పరీక్షగా మారనుంది.