ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు.
అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.