తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి,సీనియర్ నేత,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఓ వైపు మద్దతు పెరుగుతుంది. మరో వైపు ఆయనకు చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది.
ఇప్పటికే ఆయన నియోజకవర్గం హుజురాబాద్లో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.. తాజాగా పలువురు అధికారులు బదిలీ అయినట్లు సమాచారం. అలాగే క్యాడర్ చేజారిపోకుండా పలువురు మంత్రులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా సీనియర్ నాయకురాలు తుల ఉమా ఈటలతో నిన్న భేటీ అయ్యారు.