కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించగా.. కొన్నిచోట్ల కరోనా బాధితులకు సరైన చికిత్స అందడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది.
‘దేశంలో లాక్డౌన్ పెట్టాలి. కరోనా నియంత్రణలో అలసత్వం ఎందుకు? కరోనా చైన్ నియంత్రించాలంటే లాక్డౌన్ తప్పనిసరి. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు’ అని IMA లేఖలో పేర్కొంది.