ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవాళ్లపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు ఎక్కువగా ఉంటోందన్నారు.
మద్యపానం సేవించేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, CII ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో ఈ విషయం తెలిపారు.