తెలంగాణలో కొవిడ్ టీకాలలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 18ఏళ్లు దాటినవారు మరికొన్ని రోజులు ఆగాల్సివస్తోంది. ఈ నెల 15 వరకు స్లాట్ బుకింగ్ ఉండదని, తర్వాత పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తామని వైద్యారోగ్యశాఖ చెప్పింది.
ఆర్డర్ చేసినన్ని డోసులు వస్తే 18ఏళ్ల వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇక నేటి నుంచి రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు.