తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈటల రాజేందర్ ఎపిసోడ్ నుంచి పుట్టా మధు కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన సతీమణి.. కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మధు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనేది పోలీసులు చెప్పలేదు.