తమిళ రాజకీయాలు లో 68 సంవత్సరాలు వచ్చిన యువ నాయకుడు గానే వెలుగొందారు..
తండ్రి చాటు బిడ్డ ..
రష్యా సోషలిస్ట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ చనిపోయిన 4 రోజులు కి స్టాలిన్ జన్మించారు..
అందుకే కరుణానిధి జోసెఫ్ స్టాలిన్ గుర్తుగా కొడుకు కి స్టాలిన్ అని పేరు పెట్టారు..
14 ఏటా మేనమామ మురుసోలి మారన్ కి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నట ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
1976 లో ఎమర్జెన్సీ సమయం లో Misa చట్టం క్రింద పోలీసులు స్టాలిన్ నీ అరెస్ట్ చేసి చితక బాదారు ( అప్పటికే కరుణ నిది రెండు సార్లు తమిళనాడు ముఖ్య మంత్రి గా ఉన్నారు )
1982 లో తమిళ నాడు లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో Thousand lights నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు..
1989 లో తమిళ్ నాడు అసెంబ్లీ ఎన్నికలో thousand lights నుంచి మళ్లీ గెలుపొందారు..
తరవాత 1996,2001,2006 వరకు Thousand lights నుంచే గెలుపొందారు
2011 నుంచి కొలతుర్ నుంచి వరసగా మూడు సార్లు గెలుపొందారు
1996 లో మద్రాస్ మేయర్ గా ప్రత్యక్ష పద్దతిలో ఎన్నిక అయ్యారు..
2001 లో తిరిగి మద్రాస్ మేయర్ గా రెండో సారి ప్రత్యక్ష పద్దతిలో ఎన్నిక అయ్యారు..
2001 లో ముఖ్యమంత్రి గా ఉన్న జయలలిత శాసన సభ లో చట్టం చేసి ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే మద్రాస్ మేయర్ గా పోటీ చెయ్యాలి అని మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1919 కి సవరణ చేశారు..
దానితో స్టాలిన్ తన పదవి కోల్పోయారు..ఈ అంశం పై స్టాలిన్ న్యాయ పోరాటం చెయ్యలేదు.
ముఖ్యమంత్రి కొడుకు గా జన్మించిన స్టాలిన్ కి ముఖ్య మంత్రి పీఠం అంత ఈజీగా రాలేదు..
40 ఏండ్లు పార్టీ కి సేవ చెయ్యటం ద్వారా దక్కింది..
68 ఏండ్ల వయస్సు లో నేడు తమిళనాడు ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరిస్తున్న డిఎంకె యువ నాయకుడు Mk స్టాలిన్ గారికి అభినందనలు.