ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది.
లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. అటు కేరళలో నేటి నుంచి లాక్ డౌన్ ప్రారంభమైంది.