కరోనా కష్టకాలంలోనూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా.
బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విదేశాలకు, వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది