స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబర్, PIN, CVV, OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ID/పాస్వర్డ్ షేర్ చేసుకోవద్దు.
SBI, RBI, KYC అథారిటీ నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మొద్దు. మెయిల్స్, కాల్స్ వచ్చే లింకులతో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను నమ్మవద్దు.