తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,సీనియర్ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్న రాత్రి ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
‘నేను రాజకీయాల గురించి మాట్లాడేందుకు రాలేదు. ఈటల సతీమణి జమునా రెడ్డి నా సమీప బంధువు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజలతో పాటు నా మద్దతు కూడా ఉంటుంది’ అని కొండా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని బయటికి పంపడం బాధాకరమన్నారు.