ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. అయితే ఏ ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలిసుండాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ద్రాక్ష, నిమ్మకాయలు, నారింజ వంటి పుల్లని పండ్లను తినకూడదు.
పరగడుపున టీ లేదా కాఫీ తాగినా ఎసిడిటీ సమస్యలొస్తాయి. కారం, మసాలా ఆహారాలు ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. జీర్ణక్రియ డిస్టర్బ్ అవుతుంది. ఖాళీ కడుపుతో అరటి పండు, సోడా, కూల్డ్రింక్స్ కూడా వద్దు. ఆరోగ్య సమస్యలొస్తాయి.