తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది నమోదు చేస్తుంది.
జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్లను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ దవాఖానా, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లకు సూచించాయి.
ప్రతి బృందంలో క్షేత్రస్థాయి కార్మికులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, జీహెచ్ఎంసీకి చెందిన ఎంటమాలజీ అధికారి ఉన్నారు. ఈ సర్వేను జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించారు. సర్వేలో అధిక సంఖ్యలో జ్వరం కేసులు నమోదైన ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ క్రిమిసంహారక స్ప్రేను చేపడుతుంది.