ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత కృతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉప్పెన షూటింగ్‌కి ముందు దర్శకుడు తనను కొన్ని సినిమాలు చూడమని కోరాడట.
అన్నింటిలో కృతికి ‘రంగస్థలం’ బాగా నచ్చిందట. ఆ సినిమా చూశాక రామ్ చరణ్ అభిమానినైపోయానని చెప్పుకొచ్చింది. ఆయనతో ఓ సినిమా చేయాలనేది తన కోరిక అంటోంది కృతి.