తెలంగాణలో మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 6,026 పాజిటివ్ కేసులు రికార్డవగా.. 52 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది.
తాజాగా వైరస్ నుంచి 6,551 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,115, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.