తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసిన వేళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో TPCC అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినా.. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రక్రియ ఆపేశారు.
ఇప్పుడు మళ్లీ ఆ అంశంపై అందరిలో ఉత్కంఠ మొదలైంది. అధిష్టానం నిర్ణయం మార్చుకుందని, రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పేరు కూడా ఉందని సమాచారం