దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు.
ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.