ఐపీఎల్ 14వ సీజన్‌ను నిరవధికంగా రద్దు చేసింది బీసీసీఐ. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.
మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడటంతో సోమవారం జరగాల్సిన కోల్‌కతా, బెంగళూరు మ్యాచ్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం సన్‌రైజర్స్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా కూడా కొవిడ్ బారిన పడినట్లు తేలింది.
మొదట లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. తాజాగా సాహా, అమిత్ మిశ్రాలు కూడా కరోనా బారిన పడ్డారని తేలడంతో ఐపీఎల్ 14వ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు