కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు.
అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.