మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి.
ఇందులో టీఆర్‌ఎస్ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు.
మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.