మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
1వ వార్డు – పి. మాధవి(కాంగ్రెస్)
2వ వార్డు – సి. చంద్రకళ(టీఆర్ఎస్)
3వ వార్డు – కె.శ్రీనివాస్(టీఆర్ఎస్)
4వ వార్డు – ఎస్. నాయక్(కాంగ్రెస్)
5వ వార్డు – జె.అనిత(కాంగ్రెస్)
6వ వార్డు – వి.హేమ(కాంగ్రెస్)
7వ వార్డు – కమ్మరి జయమ్మ(టీఆర్ఎస్)
8 వార్డు – బి.లావణ్య(టీఆర్ఎస్)
9వ వార్డు – ఎం. నర్సింహా గౌడ్(కాంగ్రెస్)
10వ వార్డు – కరుణ(టీఆర్ఎస్)
11వ వార్డు – డి.ప్రసన్న లత (టీఆర్ఎస్)
12వ వార్డు – డి.రవీందర్(టీఆర్ఎస్)