1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ 1975లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1984లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, లోకసభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీపై సంచలన విజయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు.
1989లో ఓడి 1991లో మళ్లీ గెలిచారు. 36 ఏళ్లకే కేంద్రమంత్రి అయ్యారు. 1997లో టీఎంసీ పార్టీని స్థాపించారు. 1998, 99, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. 2011లో తొలిసారి బెంగాల్ గడ్డపై కమ్యూనిస్టులను గద్దె దించి, సీఎం అయ్యారు.
మరోవైపు నిన్న ఆదివారం విడుదలైన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ఆదివారం విడుదలయ్యాయి..ఈ ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ 213,బీజేపీ 77,ఇతరులు 2చోట్ల గెలుపొందారు..