తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
