అలనాటి అందాల తార సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. తాజాగా సౌందర్య సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ త్వరలోనే సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అగ్రహీరోలందరి సరసన నటించి.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సౌందర్య పాత్రలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం.
