ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన వైసీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్‌లో మెజారిటీ సాధిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది.
ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,24,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 2,50,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి.
బీజేపీ అభ్యర్థికి 23,223 ఓట్లు పోలయ్యాయి.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్‌లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది.