పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండు పార్టీల మధ్య ఆధిక్యాల్లో స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది.
ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసిన మమతా బెనర్జీ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ప్రస్తుతం అక్కడ ముందంజలో ఉన్నారు. దాదాపు 1497 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. సీపీఐ(ఎం) పార్టీ మూడో స్థానంలో ఉంది. ఆ పార్టీకి కేవలం 680 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం