నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఐదవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 4,334 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,676ఓట్లు, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.అయితే ఆరో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 5,177 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.