పశ్చిమ బెంగాల్లో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకువెళుతోంది. ఇప్పటికే టీఎంసీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మేజిక్ ఫిగర్ మార్క్ దాటేసిన తృణమూల్ కాంగ్రెస్… 202 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, నాలుగు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. వెనుకంజలో కాంగ్రెస్, వామపక్ష కూటమి కొనసాగుతోంది. అయితే నందిగ్రాంలో మమతా బెనర్జీ కంటే 4,500 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు.
2011లో 184 సీట్లను దక్కించుకున్న టీఎంసీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 211 సీట్లలో గెలిచి, మెజారిటీని పెంచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఎంసీ గతంకంటే కాస్త మెజారిటీ తగ్గవచ్చనే అంచనాలున్నాయి.