Home / SLIDER / తెలంగాణలో ప్రతి రోజూ పది లక్షల టీకాలు

తెలంగాణలో ప్రతి రోజూ పది లక్షల టీకాలు

తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నది. అందరికీ ఉచితంగా టీకా వేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, క్వారంటైన్‌ నుంచి బయటకు రాగానే తానే స్వయంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమీక్షిస్తానని ప్రకటించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వ్యాక్సిన్‌ను వీలైనంత ఎక్కువగా రాష్ర్టానికి తీసుకురావడానికి ప్రయత్నంచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవసరాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు రాష్ట్రంలో కోవాగ్జిన్‌ను ఉత్పత్తిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల మధ్య వయసువాళ్లు 1.75 కోట్ల మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీసింది. ఒక్కొక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ లెక్కన రాష్ర్టానికి 3.5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.

కేంద్రం నుంచి తగిన సంఖ్యలో వ్యాక్సిన్‌ సరఫరా అయితే వేగంగా అందరికీ దానిని వేసేలా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేలా యంత్రాంగాన్ని సర్కారు సంసిద్ధం చేసింది. ఇలా వ్యాక్సిన్‌ ఇవ్వగలిగితే కేవలం 35 నుంచి 40 రోజుల్లో అందరికీ వ్యాక్సిన్‌ వేయవచ్చు.

అందరికీ ఉచితమే..
———————————
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలకు సరిపడా వ్యాక్సిన్‌ను సిద్ధంచేయడానికి ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా వ్యాక్సిన్‌ పంపించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి తగినంతమేర వ్యాక్సిన్‌ అందలేదు. ఫలితంగా 45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం పూర్తికాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40 లక్షల వ్యాక్సినేషన్‌ మాత్రమే పూర్తయింది. రాష్ర్టాలు స్వయంగా వ్యాక్సిన్‌ సేకరించుకోవడానికి కేంద్రం అనుమతి ఇస్తూనే వ్యాక్సిన్‌ ధరను ఎక్కువగా నిర్ణయించింది.

కేంద్రం పూర్తిగా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల కోసం వ్యాక్సిన్‌ భారాన్ని పూర్తిగా మోయడానికి సిద్ధమయ్యారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాలమేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో సమావేశమవుతున్నారు. భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లాతో ఇప్పటికే భేటీ అయ్యారు. రాష్ర్టానికి కావాల్సిన వ్యాక్సిన్‌ను సరఫరాచేయాలని కోరారు. రాష్ట్రంలోనే వ్యాక్సిన్‌ తయారవుతున్నందున మొదటి ప్రాధాన్యంగా వ్యాక్సిన్‌ను తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన కృష్ణ ఎల్లా రాష్ర్టానికి అత్యధిక వ్యాక్సిన్‌ అందించడానికి అంగీకరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat