తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వహించిన ఎట్జిట్ పోల్స్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.
ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పార్టీల వారీగా పోలైన ఓట్ల శాతం ఈ విధంగా ఉంది. టీఆర్‌ఎస్ – 50.48%, కాంగ్రెస్ – 39.93%, బీజేపీ 6.31%.టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుండి రవి నాయక్ ఎన్నికల బరిలో ఉండగా ప్రధానంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. విజేత అనేది మాత్రం మే 2వ తేదీన తేలనుంది.