తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గతనెల 20వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.
అది ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ సైతం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు.