తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు చెప్పింది.
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,261 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒకే రోజు 77,091 పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,441 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్నగర్లో 243, జగిత్యాలలో 230 కేసులు రికార్డయ్యాయి.