సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు.
శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, రామకృష్ణను సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. కిరణ్‌కుమార్‌ను అల్వాల్ డిఐగా బదిలీ చేశారు. శివప్రసాద్‌ను మాదాపూర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్‌గా నియమించారు