టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌సింగ్ ఈ నెల 20 నుంచి రాంచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో వైద్యులు తాజాగా పరీక్షలు నిర్వహించారు.
కరోనా నెగటివ్ అని నిర్ధారణ కావడంతోపాటు, లక్షణాలేవీ లేకపోవడంతో బుధవారం వీరిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో చెన్నైకు సారథ్యం వహిస్తున్నాడు. తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు ధోనీ ముంబైలో ఉన్నాడు. ప్రస్తుతం వారు కోలుకోవడంతో ధోనీకి ఊరట లభించినట్టైంది.