ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది.
ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US పేర్కొంది.