తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు.
లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.