మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్నట్లు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేద్దాం.. మన ఆత్మగౌరవాన్ని మరో మారు చాటుదాం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకరం చేయడం కోసం 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం వేదికగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే