ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు.
ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది.
చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.