దాదాపు పదేళ్ల పాటు టాలీవుడు దూరమైన అందాల నటి, గాయని మమతా మోహన్ దాస్.. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ అమ్మడు నటించిన లాలాబాగ్ అనే మలయాళ చిత్రం.. తెలుగులోనూ డబ్ కానుంది.
ఈ మిస్టరీ థ్రిల్లర్ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయనున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ టైటిల్ సాంగ్, చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోని స్పెషల్ సాంగ్తో మమత మంచి గుర్తింపు తెచ్చుకుంది.