తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది.
తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.