కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగశేఖర్ గౌడ్ గారి అకాల మరణం పట్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ మేరకు చింతల్ లోని తన కార్యాలయం వద్ద నాగశేఖర్ గౌడ్ గారి ఫోటో కు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
వారు నిత్యం ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో పని చేసే వారని ఎమ్మెల్యే గారు అన్నారు. అలాంటి మంచి వ్యక్తి లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని, వారి కుటుంబ సభ్యులకు మరింత శక్తి, మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థించారు.