తెలంగాణ రాష్జ్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ఫోన్ చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడాలని ఆమె ఆకాంక్షించారు.