ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన వకీల్ సాబ్ చిత్రం కరోనా సమయంలోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. తొలి నాలుగు రోజులు అయితే సింపుల్‌గా బాక్సాఫీస్‌ను కుమ్మేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ తర్వాత మాత్రం సినిమా దూకుడు తగ్గిపోయింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్దాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా 13 రోజుల ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..
నైజాం- 24.10 కోట్లు
సీడెడ్- 12.71 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.60 కోట్లు
ఈస్ట్- 6.14 కోట్లు
వెస్ట్- 7.13 కోట్లు
గుంటూరు- 7.07 కోట్లు
కృష్ణా- 4.88 కోట్లు
నెల్లూరు- 3.33 కోట్లు