తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు..
ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు.