దేశంలో కరోనా విలయ కొనసాగుతున్నది. రోజు రోజుకు మహమ్మారి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695కు పెరగ్గా.. ఇప్పటి వరకు 1,36,48,159 మంది కోలుకున్నారు.
మొత్తం మహమ్మారి బారినపడి 1,86,920 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 13,54,78,420 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
ఓ వైపు టీకా డ్రైవ్ కొనసాగుతుండగా.. రోజువారీ కొవిడ్ కేసులు పెరుగుతుండడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒకే రోజు 17,40,550 కొవిడ్ నమూనాలు పరీక్షించగా.. ఇప్పటి వరకు 27.44 కోట్ల శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.