తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది.
అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
నిన్న ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటాయి. 24 గంటల్లో 1,005 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ తర్వాత అత్యధికంగా మేడ్చల్‌లో 502, రంగారెడ్డి 373, నిజామాబాద్ 406, మహబూబ్‌నగర్ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.