ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి.
1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు.
2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది.
3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది.