తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు అని స్పష్టం చేశారు. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఒక వేళ బయటకు వెళ్లాలనుకుంటే దయచేసి తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఎంపీ సంతోష్ కుమార్ సూచించారు.