తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.అగ్ర హీరో .. మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్ పై ఉండగానే మరో మూడు చిత్రాలను అంగీకరించారు.
చిరంజీవి. తాజాగా ఆయన వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘మహర్షి’ సినిమాతో దర్శకుడు వంశీ పైడిపల్లి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు. ఇటీవలే చిరంజీవిని కలిసిన వంశీపైడిపల్లి ఓ కథను వినిపించగా, సామాజిక ఇతివృత్తంతో కూడిన ఈ కథ నచ్చడంతో చిరంజీవి ఓకే అన్నారట.